'8న బ్లాక్‌ డే.. పెద్ద ఎత్తున నిరసనలు' | Sakshi
Sakshi News home page

'8న బ్లాక్‌ డే.. పెద్ద ఎత్తున నిరసనలు'

Published Fri, Nov 3 2017 4:09 PM

november 8 as  black day to protest demonetisation says uttam kumar reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా నవంబర్ 8న బ్లాక్ డే పాటిస్తున్నామని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపనున్నట్లు చెప్పారు. రుణ మాఫీపై వడ్డీ భారం లెక్కలు సేకరిస్తున్నామని, రైతుల నుంచి వివరాలు తీసుకుంటున్నామని తెలిపారు. వడ్డీ భారం ఇవ్వకపోవడం అంటే రుణ మాఫీ విఫలమైనట్టేనని అన్నారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు పోటీ చేస్తామని, అన్నిచోట్ల గట్టి అభ్యర్థులు ఉన్నారని తెలిపారు.

నల్గొండ, మహబూబ్‌నగర్, పాత రంగారెడ్డిలో మొత్తం సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కోదాడలో చందర్‌రావ్ మాత్రమే కాంగ్రెస్‌కు పోటీ ఇవ్వగలరని, హుజుర్ నగర్‌లో మంత్రి జగదీష్ రెడ్డి పోటీ ఇవ్వలేరని, గుత్తా కూడా పోటీకి భయపడ్డారని, జగదీశ్ రెడ్డి గతంలో ఓడిపోయారని, శంకరమ్మ మాత్రమే పోటీ ఇవ్వగలదని ఉత్తమ్‌ చెప్పారు.

Advertisement
Advertisement